ECET : ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం మంత్రి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ రామ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
78.65 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని, పరీక్షకు మొత్తం 51 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. 40 వేల 890 మంది అర్హత సాధించారన్నారు. పురుషులు 78.28 శాతం, మహిళలు 79.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.
ర్యాంకుకు సంబంధించిన కార్డులను ఈ నెల 30 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. మొదటి 10 ర్యాంకుల్లో నలుగురు మహిళలు ఉండగా, తెలంగాణకు చెందిన శుభశ్రీ, అవినాష్ సిన్హా 3, 4 ర్యాంకులు సాధించారు.
10 Ranks
దరూరి ఫణిత్ 1 తిరుపతి
రాయుడు అభిరామ్ 2 విశాఖ
బి.శుభశ్రీ 3 హైదరబాద్
అవినాష్ సిన్హా 4 హైదరాబాద్
వేముల అనీల్ కుమార్ 5 ప్రకాశం
శేఖర మంత్రి అవినాష్ 6 విశాఖ
కోయిలాడ లోకేశ్వరి 7 విశాఖపట్నం
శిట్టి వెంకటేష్ 8 శ్రీకాకుళం
శర్వాణి జీడీఎస్ 9 కాకినాడ
గొంగడ లక్ష్మీ లావణ్య 10 శ్రీకాకుళం