Ap Government Employees
AP Employees Union : ఏపీలో ఒకరకమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. పీఆర్సీ అమలు చేసి తీరుతామని ప్రభుత్వం పట్టుబడుతుంటే.. సమ్మె తప్పదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగులు.. ఉద్యమ కార్యాచరణపై మధ్యాహ్నం రెండు గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలిస్తామంటూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండిలోగా ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రెజరీ ఉద్యోగులను ఆదేశించింది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు అప్‌డేట్ చేసేది లేదంటున్నారు ఉద్యోగులు.
Read More : Illegal Constructions : అక్రమ కట్టడాలపై హెచ్‌ఎండీఏ ఉక్కుపాదం.. 82 అక్రమ నిర్మాణాలు కూల్చివేత
కొత్త పే స్కేల్‌తో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ.. ట్రెజరీ, CFMS, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పురోగతిపై ప్రతీరోజూ 11 గంటలలోగా డైరెక్టర్‌కు వివరించాలని ఆదేశించింది. CFMSకి అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలని సూచించింది. ఈనెల 25లోగా కొత్త పే రోల్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read More : Corona Vaccine: కోవిడ్ వాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
– 26న అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందచేస్తారు.
– 27 నుంచి 30 తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు.
– ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు.
– ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం.
Read More : Varshini : కొత్త ఫొటోషూట్‌తో కాక రేపుతున్న వర్షిణి
– వచ్చే నెల 5 అన్ని ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బంది సహాయ నిరాకరణ.
– అన్ని విభాగాల యాప్‌లలో సమాచారం అప్‌లోడ్ చేయడం నిలిపివేస్తారు.
– ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.
– పీఆర్సీ సాధన సమితి నిర్ణయానికి అనుగుణంగా ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళతామని ఆర్టీసీ యూనియన్లు ప్రకటించాయి.