AP Entrance Exams : ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Ap Entrance Exams

AP Entrance Exams : ఏపీలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఆగస్టు 19-25 ఈఏపీ సెట్‌ పరీక్షా ఉండగా నిర్వహణ బాధ్యతను జెఎన్టీయూ కాకినాడకు అప్పగించారు. సెప్టెంబర్ 17,18 తేదీల్లో ఐ సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.. దీని బాధ్యత విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ అప్పగించారు. సెప్టెంబర్ 19న ఈ సెట్‌ దీని నిర్వహణ బాధ్యత జెఎన్టీయూ అనంతపురం చేతిలో పెట్టారు.

సెప్టెంబర్ 27-30 తేదీల్లో పీజీ ఈసెట్‌ పరీక్షలు ఉండగా ఎస్వీయూ తిరుపతికి బాధ్యత అప్పగించారు. సెప్టెంబర్ 21న ఎడ్‌ సెట్‌ పరీక్ష ఉండగా నిర్వహణ బాధ్యత విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి అప్పగించారు. సెప్టెంబర్ 22న లా సెట్‌ ను శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి నిర్వహణ బాధ్యత అప్పగించారు.