Andhra Pradesh : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు.

Nallari Kiran Kumar Reddy

Andhra Pradesh :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పలువురు సీనియర్ నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ అధిష్టానం ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.