Minister Buggana Rajendranath : త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన : మంత్రి బుగ్గన

సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన జరుగుతుందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమయంలో రెవిన్యూ నెగిటివ్ స్టేట్, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అన్నారు.

Minister Buggana Rajendranath : సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన జరుగుతుందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమయంలో రెవిన్యూ నెగిటివ్ స్టేట్, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అన్నారు. ఉద్యోగుల జీతాలు ఒకటి, రెండు రోజులు లేట్ అవడం కొత్తేమీ కాదని.. గతంలోనూ జరిగాయని చెప్పారు. 1920 నుంచి తెలుగు వాళ్లకు రాష్ట్రంకు శ్రీబాగ్ ఒప్పందం అంటే వికేంద్రీకరణ అని అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.

తెలంగాణ విషయం వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణకు మొగ్గు చూపిందన్నారు. శివరామకృష్ణ కమిటీ మన పార్లమెంట్ ఒక చట్టపరంగా వికేంద్రీకరణ మంచిదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్వరగా అభివృద్ధి కావాలన్నా కూడా వైజాగ్ మంచిదని నిర్ణయించామని వెల్లడించారు. చంద్రబాబు మీటింగ్ లో 12 మంది చనిపోయారని.. అందుకే రూల్స్ పాటించమన్నామని చెప్పారు. అంతేకాని కొత్తగా రూల్స్, ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు.

AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే.. తేల్చి చెప్పిన కేంద్రం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నగరం అభివృద్ధికి వైజాగ్ సెట్ అవుతుందన్నారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం పరిగణలోకి తీసుకొని హైకోర్టు వివిధ న్యాయ ట్రిబనల్స్, కమిషన్లు కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిన్న (మంగళవారం) బెంగళూరు మీటింగ్ లో వైజాగ్ అన్నిటికీ మేలు అని చెప్పామని తెలిపారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో కూడా కోర్టు ఒకచోట, రాజధాని మరో చోట ఉందన్నారు.

మూడు రాజధానులు పెట్టింది వికేంద్రీకరణకు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. రోడ్ల కోసం గత ప్రభుత్వం కంటే తాము ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పారు. తక్కువ అప్పు చేశామని.. కోవిడ్ లో కూడా ఎక్కువే ఖర్చు చేశామని తెలిపారు. కోర్టు, రాజధాని, పరిపాలన అంటే కొంతమంది ఒకే చోటేనా అని తనకున్న మీడియా శక్తితో ప్రాపగండం చేస్తున్నారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు