AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే.. తేల్చి చెప్పిన కేంద్రం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు

అమరావతి, మూడు రాజధానుల కేసులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతినే అఫిడవిట్ లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 5,6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని, 2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది.

AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే.. తేల్చి చెప్పిన కేంద్రం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు

AP Capital Amaravati : అమరావతి, మూడు రాజధానుల కేసులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతినే అఫిడవిట్ లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 5,6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని, 2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది.

Also Read..Amaravati-parliament : విభజన చట్టం ప్రకారమే ‘అమరావతి ’ ఏర్పాటైంది : ఏపీ రాజధానిపై కేంద్రం సమాధానం

విభజన చట్టంలోని 94 ప్రకారం రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చామని కేంద్రం తెలిపింది. నిపుణుల కమిటీ సిఫారసులు, సీఆర్డీఏ చట్టంతో కూడిన జీవో కాపీలను సుప్రీంకోర్టు కౌంటర్ అఫిడవిట్ లో జత చేసింది కేంద్రం. మూడు రాజధానుల కేసుపై ఈ నెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Also Read..AP Early Elections : 75మంది తిరుగుబాటుకు సిద్ధం, నవంబర్‌లోపే ముందస్తు ఎన్నికలు..! అచ్చెన్న సంచలనం

”రాష్ట్ర విజభన చట్టం ప్రకారమే రాజధాని అమరావతి ఏర్పాటైంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటు జరిగింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 23నే నోటిఫై చేసింది.
విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారమే నిపుణుల కమిటీ వేసింది.

నిపుణుల కమిటీ సూచనలతో అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌తో పాటు ముఖ్యమైన పట్టణ మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాల్సి ఉంది. కొత్త రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు మంజూరు చేశాం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

2020లో రాష్ట్ర ప్రభుత్వం 2 కొత్త చట్టాలు తీసుకొచ్చింది. సీఆర్‌డీఏ రద్దు, 3 రాజధానుల ప్రతిపాదనతో చట్టాలు చేసింది. ఈ రెండు చట్టాలు తీసుకొచ్చే ముందు కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులు జరపలేదు. ఇంతకుమించి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు” అని సుప్రీంకోర్టులో జారీ చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది.

నిపుణుల కమిటీ సిఫారసులు, సెక్షన్‌ 5, 6, 94కు సంబంధించిన డాక్యుమెంట్లు, 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ సీఆర్‌డీఏ చట్టంతో కూడిన జీవో 97 కాపీలను అఫిడవిట్ లో జత చేసింన కేంద్రం. ఈ నెల 23న మూడు రాజధానుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.(AP Capital Amaravati)