AP Early Elections : 75మంది తిరుగుబాటుకు సిద్ధం, నవంబర్‌లోపే ముందస్తు ఎన్నికలు..! అచ్చెన్న సంచలనం

75మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు అచ్చెన్నాయుడు.

AP Early Elections : 75మంది తిరుగుబాటుకు సిద్ధం, నవంబర్‌లోపే ముందస్తు ఎన్నికలు..! అచ్చెన్న సంచలనం

AP Early Elections : ముందస్తు ఎన్నికల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముందస్తు ముచ్చట.. రాజకీయాలను వేడెక్కించింది. టీడీపీ నేతల నోట మరోసారి ముందస్తు ఎన్నికల మాట వినిపించింది. రాష్ట్రంలో ఎర్లీ ఎలక్షన్స్ వస్తాయని వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతేకాదు.. 75మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తారు? అందుకు గల కారణాలు ఏంటో కూడా చెబుతున్నారు.

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ముందస్తు ఎన్నికలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్వసన్నద్ధంగా ఉండాలనే లక్ష్యంతో వ్యూహ కమిటీ సమావేశం జరిగిందన్నారు.

Also Read..Lokesh RTC Driver : లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన బస్సు డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు..! ఆర్టీసీ క్లారిటీ

ముందస్తు ఎన్నికలకు పార్టీ శ్రేణులను చైతన్య పరిచేందుకు ఈ నెల 21 నుంచి 5 రోజుల పాటు 5 జోన్లలో చంద్రబాబు సమావేశాలు ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయిలో తాజా పరిణామాలు ముందస్తు ఎన్నికలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు అచ్చెన్నాయుడు. లక్షల కోట్ల అప్పుతో పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం నడపటం కష్టమే అన్నారాయన. మార్చి తర్వాత కేంద్రం కొత్త అప్పులకు అంగీకారం తెలిపితే, ఒకటి రెండు నెలలు గడిపి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నారని అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, లోకేశ్ సభలకు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక, ఓటమి భయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. బాబాయ్ హత్య కేసులో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతున్నాయన్నారు. సాధారణ ఎన్నికలలోపు వివేకా హత్య కేసు నిందితులెవ్వరో తేలిపోతుందని, ఆలోపే ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పై గతంలో ఉన్న సీబీఐ కేసుల విచారణ వేగవంతం కానుండటంతో ముందస్తుకు సిద్ధం అవుతున్నారని వ్యాఖ్యానించారు.

Also Read..Amaravati-parliament : విజభన చట్టం ప్రకారమే ‘అమరావతి ’ ఏర్పాటైంది : ఏపీ రాజధానిపై కేంద్రం సమాధానం

”విశాఖ రాజధాని అజెండాగా ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. 75మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా ఓ ఉదాహరణ మాత్రమే. ఎమ్మెల్యేల తిరుగుబాటు ముదరక ముందే ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా 160 స్థానాల్లో తెలుగుదేశం విజయం ఖాయం” అని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”మార్చిలో వచ్చే బడ్జెట్ వెసులుబాటు 3నెలలు ఉపయోగించుకుని తర్వాత చేతులెత్తేసే యోచనలో జగన్ ఉన్నారు. నవంబర్ లోపే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ ని సాగనంపి, రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తి కల్పిస్తాం. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో మలుచుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాo. ఈ నెల 21 నుంచి 5 రోజుల పాటు చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశాల్లో పోల్ మేనేజ్ మెంట్ అజెండాగా జరుగుతాయి. అంతర్గత కుమ్ములాటల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకరు” అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు.