Lokesh RTC Driver : లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన బస్సు డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు..! ఆర్టీసీ క్లారిటీ

పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను విధుల నుంచి తొలగించారని సోషల్ మీడియాలో ఐ-టీడీపీ పోస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీని మీద రచ్చ నడుస్తోంది. దాంతో ఈ వ్యవహారంపై ఆర్టీసీ స్పందించింది.

Lokesh RTC Driver : లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన బస్సు డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు..! ఆర్టీసీ క్లారిటీ

Lokesh RTC Driver : పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను విధుల నుంచి తొలగించారని సోషల్ మీడియాలో ఐ-టీడీపీ పోస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీని మీద రచ్చ నడుస్తోంది. దాంతో ఈ వ్యవహారంపై ఆర్టీసీ స్పందించింది.

ఆర్టీసీ యాజమాన్యం.. ఆ డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించలేదని ట్వీట్ చేసింది. అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

లోకేశ్ పాదయాత్రలో ఉన్నప్పుడు మొబైల్ చూపిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆర్టీసీ డ్రైవర్. షేక్ హ్యాండ్ ఇచ్చిన సమయంలో డ్రైవర్ విధుల్లో ఉన్నాడు. దాంతో ఆయనను విధుల్లోంచి తొలగించారని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రాజకీయ రంగు కూడా పులుముకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దాంతో ఆర్టీసీ స్పందించింది. అసలు విషయాన్ని చెబుతూ క్లారిటీ ఇచ్చింది.

Also Read..Amaravati-parliament : విజభన చట్టం ప్రకారమే ‘అమరావతి ’ ఏర్పాటైంది : ఏపీ రాజధానిపై కేంద్రం సమాధానం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఆయనతో షేక్ హ్యాండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ పై ఏపీఎస్ ఆర్టీసీ కక్షసాధింపుకు దిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నారా లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు ఆ డ్రైవర్ ను ఉన్నతాధికారులు తొలగించారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. లోకేశ్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేయడంతో మరింత వివాదం చెలరేగింది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించామనడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లాలో పాదయాత్రగా సాగుతున్న నారా లోకేశ్ కు ఆర్టీసీ బస్ ఎదురైంది. అందులోని ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్ లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంతేకాదు తన మొబైల్‌కు ఉన్న చంద్రబాబు కవర్‌ను అందరికీ చూపించారు. బస్సు డ్రైవర్.. లోకేశ్ కు షేక్ హ్యాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత వివాదం చెలరేగింది.

Also Read..Phone Tapping In YCP : తన ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్‌శాఖకు కోటంరెడ్డి ఫిర్యాదు

ఆ డ్రైవర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారనే ప్రచారం మొదలైంది. దీనిపై లోకేశ్ కూడా తీవ్రంగా స్పందించారు. తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి మద్దతు తెలిపినందుకే ఆ బస్సు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ డ్రైవర్ తన అభిమానాన్ని మాత్రమే చాటుకుంటున్నారని.. ఆయన ఏం నేరం చేశారని ప్రశ్నించారు. ఇది పాలకుల్లో ఉన్న భయానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆ డ్రైవర్ ను నిజంగానే విధుల నుంచి తొలగించారా? అంటూ కొంతమంది నెటిజన్లు ఏపీఎస్ ఆర్టీసీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీంతో ఆర్టీసీ స్పందించింది. డ్రైవర్ ను విధుల్లో నుంచి తొలగించారనే దాంట్లో నిజం లేదని తేల్చి చెప్పింది.