AP Oxygen Plant : ఏపీలో ప్రారంభమైన తొలి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. ఏపీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చేసింది.

Ap First Oxygen Generation Plant Center Launched

AP First Oxygen Generation plant Center : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. ఏపీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చేసింది. డీఆర్డీవో, ఎన్‌హెచ్‌ఏఐ సహకారంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వారం రోజుల్లో ఈ ఆక్సిజన్‌ ప్లాంట్ నిర్మించారు.

ఆక్సిజన్ ప్లాంట్‌ను ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్, మంత్రి శంకర్‌ నారాయణ ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో మౌలిక సదుపాయాలు పెంచుతామని తెలిపారు.

కరోనా బాధితులకు వైద్య సేవలు కోసం సీఎం జగన్‌ అన్నిచర్యలు తీసుకుంటున్నారని ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడా లేదన్నారు. అందుకే హిందూపురంలో ఏర్పాటైన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ దేశంలోనే మొదటి ఆక్సిజన్ ప్లాంట్‌గా తెలిపారు.