ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బిగ్‌షాక్ తగిలింది. ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండవా కప్పి జగన్ ఆహ్వానించారు. అలాగే, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చెయ్యడానికి వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
అమెరికాలో విమానం మిస్సింగ్.. మొన్న ప్రమాదం.. ఇప్పుడు మరొకటి అదృశ్యం..
వైద్య కాలేజీలు, పోర్టులు, రోడ్లను ప్రయివేటుకు ఇవ్వడం దుర్మార్గమని శైలజానాథ్ చెప్పారు. ఈ సమయంలో వైసీపీలో ఉంటేనే పోరాటం చేయగలమని అన్నారు. వైసీపీతోనే ప్రజలకు న్యాయం చేయగలమని తెలిపారు.
ప్రజల కోసం పోరాటం చేయడానికి బలమైన నాయకత్వం కావాలని, అది జగన్ దగ్గర ఉందని చెప్పారు. మిగిలిన కాంగ్రెస్ నేతలను తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని, తాను సొంతంగా వైసీపీలో చేరానని అన్నారు. మిగిలినవాళ్లు కొందరు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుందని చెప్పారు.