Four Teenegers Drown In Penna River
Four teenegers drown in penna river : పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు.దీంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా మూడు మృతదేహాలను లభ్యమయ్యాయి. ఏపీలోని కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నానదిలో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నది ప్రవాహం ధాటికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు.
అందులో మూడు మృతదేహాలను వెలికితీయగా… మరోకరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతైన యువకులు అంతే మైనర్లే. వీరిని కడప బెల్లం మండి వీధి వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు అబ్దుల్ రషీద్ అనే 18 ఏళ్ల యువకుడితో పాటు అనూప్ ఖాన్ 15 యువకుడు, జవేరియా అనే 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు తెలిపారు.
పెన్నానదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతు అయినట్లుగా తెలుస్తోంది. కాగా..పెన్నానదిలో తరచు పలువురు గల్లంతు కావటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో కూడా ఇటువంటి ఘటనలే జరిగినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదనీ..ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసి తరువాత ఆ సంగతే పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.