AP Government : హాకీ క్రీడాకారిణి రజనీకి రూ.25 లక్షలు, వెయ్యి గజాల స్థలం, ప్రభుత్వ ఉద్యోగం.

టోక్యో ఒలింపిక్స్ లో ప్రతిభ కనబరిచిన హాకీ క్రీడాకారిణి రజనీకి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. రూ.25 లక్షల రూపాయల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

Ap Government

AP Government : టోక్యో ఒలింపిక్స్ లో ప్రతిభ కనబరిచిన హాకీ క్రీడాకారిణి రజనీకి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. రూ.25 లక్షల రూపాయల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. బుధవారం తల్లిదండ్రులతో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రజనీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

ఒలింపిక్స్ లో ప్రతిభకనరిచిన కనబరిచిన రజనీని శాలువాతో సత్కరించారు సీఎం జగన్.. అనంతరం మెమెంటో అందచేశారు. ఈ సందర్బంగా ఆమెకు ఇవ్వాల్సిన అన్ని ప్రత్సాహకాలను ఇవ్వాలని తెలిపారు. తిరుపతిలో వేయ్యి గజాల నివాస స్థలంతోపాటు ప్రతి నెల రూ.40 వేల నగదు అందించాలని క్రీడాశాఖ అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

ఇక అనంతరం క్రీడాశాఖామంత్రి అవంతి శ్రీనివాస్ ను రజనీ కలిశారు. 110 అంతర్జాతీయ హాకీ మ్యాచ్లలో ఆడిన రజనీని మంత్రి అభినందించారు. శాలువాతో సన్మానం చేశారు.