Andhrapradesh: అనుమతి ఉన్నా అరెస్ట్‌లా? ప్రభుత్వం దిగిరాకుంటే నిరవదిక పోరాటాలకు సిద్ధం

ఏపీ ప్రభుత్వం తీరుమార్చుకొని అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నిరవదిక పోరాటాలకు సిద్ధమవుతామని ఏపీ సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్ వాడీలు (AP Anganwadis) తలపెట్టిన ‘ఛలో విజయవాడ’ (Chalo Vijayawada) కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు బయల్దేరిన అంగన్‌వాడీ కార్యకర్తల (Anganwadi workers) ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వేలాదిమంది అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరును సీఐటీయూ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. విజయవాడలో జరిగిన సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నర్సింగరావు (CITU State General Secretary CH. Narsinga Rao) మాట్లాడుతూ.. మార్చి 20న ధర్నా చేస్తామని మార్చి 7న అనుమతి తీసుకున్నామని, అయినా పోలీసులు అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ వొచ్చే వాళ్ళను అన్ని ప్రాంతాల్లో అడ్డుకున్నారని, ధౌర్జన్యంగా 3,315 మందిని అరెస్ట్ చేశారని ఆన్నారు. ప్రతి జిలాల్లో 2వేల మందికిపైగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరు అప్రజాస్వామికమని, ధర్నాచౌక్ ఉన్నది ఎందుకంటూ ప్రశ్నించారు. ఇదే పరిస్థితి గతంలో ఉంటే నువ్వా పాదయాత్ర చేసేవాడివా? అని సీఎం జగన్‌  (CM Jagan) ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 1ను రద్దు చేయాలని నర్సింగరావు డిమాండ్ చేశారు.

Andhra Pradesh : అంగన్‌వాడీల ‘ఛలో విజయవాడ’నిరసనలో ఉద్రిక్తత .. వేలాదిమంది అరెస్ట్

లక్ష 20వేల మంది అంగన్వాడీలు పనిచేస్తున్నారని, నాలుగేళ్లుగా సమస్యల పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే అధికంగా వేతనం ఇస్తామని పాదయాత్ర‌లో హామీ ఇచ్చిన జగన్.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ హామీని మర్చారన్నారు. అంగన్వాడీ పోస్టులు అమ్ముకొంటున్నారని ఆరోపించారు. మినీ సెంటర్‌లు మెయిన్ సెంటర్స్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల‌ సాధనకు నిరవధిక పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.

AndhraPradesh MLC elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. బోగస్ ఓట్లపై ఫిర్యాదులు వస్తున్నాయన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

అంగన్‌వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరవ్వమ్మ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నానా బీభత్సం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుజ్జి అనే అంగన్వాడీ వర్కర్ హార్ట్ ఎటాక్ వొచ్చి ఆసుపత్రి‌లో ఉందన్నారు. 2.76వేల కోట్లు బడ్జెట్ పెట్టారని, అంగన్వాడీ‌లకు ఏం కేటాయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉక్కుపాదం మోపితే ఉద్యమం ఆగదని, నిరవధిక పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. డబ్బులు తీసుకొని కొందరు ఎమ్మెల్యే‌లు హెల్పర్స్‌కి అన్యాయం చేస్తున్నారని, పోస్టింగ్‌లు ప్రజాప్రతినిధులు అమ్ముకొంటున్నాని ఆరోపించారు. సంపూర్ణ పోషన్ పేరుకేనని, ఐదు గ్రాములతో పోషన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వహణకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అన్నారు. అంగన్వాడీ యూనియన్‌ని చర్చలకు ప్రభుత్వం పిలవాలని, లేదంటే దీర్ఘ కాల పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Andhra Pradesh: సాకారం కానున్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల కల.. కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా నియామకం

అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేబి రాణి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. అందరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, నాసిరకంగా పోష్టికాహారం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. మేము గతంలో జగన్ దగ్గర‌కు వెళ్ళలేదని, జగన్ మా దగ్గర‌కి వొచ్చాడని అన్నారు. మా ఆందోళనకు టీడీపీ, సీపీయం నాయకులు మద్దతు తెలిపితే మద్దతు తెలిపిన వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు