Andhra Pradesh: సాకారం కానున్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల కల.. కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా నియామకం

1998 డీఎస్సీలో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులను మినిమం టైం స్కేలు పద్ధతిలో, టీచర్లుగా నియామకం చేయటానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్‌కు ప్రభుత్వం అనుమతిస్తూ బుధవారం జీవో నెంబర్ 27, స్పెషల్ కేసు కింద ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: సాకారం కానున్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల కల.. కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా నియామకం

Andhra Pradesh: 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల 25 సంవత్సరాల కల సాకారం కాబోతుంది. 1998 డీఎస్సీలో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులను మినిమం టైం స్కేలు పద్ధతిలో, టీచర్లుగా నియామకం చేయటానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్‌కు ప్రభుత్వం అనుమతిస్తూ బుధవారం జీవో నెంబర్ 27, స్పెషల్ కేసు కింద ఉత్తర్వులు జారీ చేసింది.

CM Jagan: వచ్చే జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్.. నాలుగేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి: సీఎం జగన్

ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4534 మంది 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు మినిమం టైం స్కేల్ పద్ధతిలో నియామకం పొందనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో వీరిని ఎస్జీటీలుగా నియమిస్తారు. త్వరలో కౌన్సెలింగ్ అనంతరం అభ్యర్థులందరికీ నియామకపు పత్రాల్ని ప్రభుత్వం అందజేస్తుంది. వీరి నియామకానికి సంబంధించి జగన్ తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం సీఎం జగన్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పాతికేళ్ల తర్వాత అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు వస్తుండటంతో 4534 మంది కుటుంబాలలో ఆనందం నెలకొంది. అయితే, అభ్యర్థుల్లో చాలా మంది రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉండి ఉంటారు.