CM Jagan: వచ్చే జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్.. నాలుగేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి: సీఎం జగన్

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా పూర్తి చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో అందరికంటే ముందున్నాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎక్కడ రాజీ పడలేదు. వివిధ వర్గాల ప్రజలకు అందించే పథకాల ద్వారా 1,97,473 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం.

CM Jagan: వచ్చే జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్.. నాలుగేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి: సీఎం జగన్

CM Jagan: వచ్చే జనవరి నుంచి ఏపీలో రూ.3 వేల పెన్షన్ అమలు చేస్తామని చెప్పారు సీఎం జగన్. తన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని గ్రామాల రూపు రేఖలు మారాయన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.

MLA Sandra Venkata Veeraiya: దమ్ముంటే నాపై పోటీ చెయ్.. పిడమర్తి రవికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సవాల్

‘‘ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా పూర్తి చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో అందరికంటే ముందున్నాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎక్కడ రాజీ పడలేదు. వివిధ వర్గాల ప్రజలకు అందించే పథకాల ద్వారా 1,97,473 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల పాలన మరింత ప్రజలకు చేరువయ్యింది. రాష్ట్రంలో వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలు చేసాం. 51 ఆర్డీవో ఆఫీసులను 76 ఆర్డీవో ఆఫీసులకు పెంచాం. 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, పాలనను ప్రజలకు చేరువ చేశాం. నాలుగేళ్ల పరిపాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి. ఏ గ్రామానికి వెళ్లినా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్బీకే, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు-నేడుతో స్కూళ్లలో మార్పులు జరిగాయి.

TSPSC Paper Leak: పది లక్షలు ఇచ్చేంత ఆర్థిక స్థోమత లేదు.. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల తల్లిదండ్రులు

గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు 45 నెలల్లో జగన్ మార్క్ కనిపిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా నెం.1గా రాష్ట్రాన్ని నిలబెట్టాం. దీంతో పెట్టుబడులు వస్తున్నాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత వైఎస్సార్సీపీకి దక్కుతుంది. వచ్చే జనవరి నుంచి రూ.3వేల పెన్షన్ అందిస్తాం. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి రూ.1000 పెన్షన్ అందేది. మా హయాంలో 64 లక్షల మందికి రూ.2750 చొప్పున పెన్షన్ అందిస్తున్నాం. ఏపీ మాదిరిగా పెన్షన్, రేషన్ అందిస్తున్న విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. రేషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచాం. ప్రజలకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం’’ అన్నారు సీఎం జగన్.