TSPSC Paper Leak: పది లక్షలు ఇచ్చేంత ఆర్థిక స్థోమత లేదు.. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల తల్లిదండ్రులు

రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితులు మా దగ్గర లేవు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇద్దరు కొడుకులు గత ఐదేళ్ల నుంచి మహారాష్ట్రలోనే ఉంటున్నారు. బంధువుల అమ్మాయి కావడం వల్లే రేణుకకు డబ్బులు ఇచ్చి వుంటాడు. కానీ ఈ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం గురించి వాళ్లు మాతో ఎప్పుడూ చెప్పలేదు. 

TSPSC Paper Leak: పది లక్షలు ఇచ్చేంత ఆర్థిక స్థోమత లేదు.. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల తల్లిదండ్రులు

TSPSC Paper Leak

TSPSC Paper Leak: తమకు రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక స్థోమత లేదన్నారు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు నిందితులు రాజేందర్, నీలేశ్ తల్లిదండ్రులు. పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్టైన వారిలో రాజేందర్, నీలేశ్ కూడా ఉన్నారు. తమ కొడుకుల అరెస్టుపై వారి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు.

Durgam Cheruvu Cable Bridge : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేస్తే రూ. 2 వేలు జరిమానా

‘‘రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితులు మా దగ్గర లేవు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇద్దరు కొడుకులు గత ఐదేళ్ల నుంచి మహారాష్ట్రలోనే ఉంటున్నారు. బంధువుల అమ్మాయి కావడం వల్లే రేణుకకు డబ్బులు ఇచ్చి వుంటాడు. కానీ ఈ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం గురించి వాళ్లు మాతో ఎప్పుడూ చెప్పలేదు. నిన్న నీలేశ్‌ను కలుద్దాం అని చాలా ప్రయత్నం చేశాం. కానీ పోలీసులు అవకాశం ఇవ్వలేదు. పేపర్ లీకేజీ వ్యవహారం అంతా పంచంగల్ తాండలోని రేణుక అత్తారింట్లో జరిగిందని పోలీసులు వెల్లడించారు.

కానీ మా పిల్లలు గత నెలలో ఊళ్ళో పండుగ వుందని వెళ్ళారు. గత వారం వాళ్లు ఊళ్ళోనే లేరు. టీవీల్లో వచ్చిన కథనాలను చూసి షాక్‌కి గురయ్యాం. మా పిల్లలు అలాంటి వారు కాదు. ఎవరు.. ఎందుకు చేశారో తెలియదు. మా పిల్లలను ఒక్కసారైనా చూపించాలి’’ అని రాజేందర్, నీలేశ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.