AndhraPradesh MLC elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. బోగస్ ఓట్లపై ఫిర్యాదులు వస్తున్నాయన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలను రేపు ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటింగ్ లో బ్యాలెట్లను మాత్రమే వాడతారని చెప్పారు. ప్రస్తుతం 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ నుంచి 500 జంబో బ్యాలెట్ బాక్సులను తెప్పించా మని అన్నారు.

AndhraPradesh MLC elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. బోగస్ ఓట్లపై ఫిర్యాదులు వస్తున్నాయన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

Andhra Pradesh MLC elections

Andhra Pradesh MLC elections: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలను రేపు ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటింగ్ లో బ్యాలెట్లను మాత్రమే వాడతారని చెప్పారు. ప్రస్తుతం 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు.

తెలంగాణ నుంచి 500 జంబో బ్యాలెట్ బాక్సులను తెప్పించా మని అన్నారు. 10 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయటానికి అనుమతి ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రూ.77 లక్షలు సీజ్ చేశామని, లిక్కర్ కూడా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. బోగస్ ఓట్లపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సీపీఎం, టీడీపీ నుంచి ఫిర్యాదులు అందాయని, తిరుపతి అర్బన్ నుంచి మాత్రమే ఈ ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

మిగతా ఎక్కడ నుంచి ఫిర్యాదులు లేవని తెలిపారు. 663 పేర్లు బోగస్ ఓట్లని చంద్రబాబు పిర్యాదు చేశారని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. 500 పేర్ల మీద ఇప్పటికే విచారణ చేసి ఈసీకి నివేదిక పంపామని అన్నారు. మిగతా వాటి మీద కలెక్టర్ విచారణ చేస్తున్నారని, నివేదిక ఇవాళే ఇస్తారని తెలిపారు. అడ్రస్ తప్పని గుర్తించిన వారికి అర్హత ఉందా? లేదా? అనేది రిపోర్టు వచ్చిందని చెప్పారు. ఒకే అడ్రస్ మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు పరిశీలిస్తే వారంతా అదే ప్రాంతానికి చెందిన వారే అని గుర్తించామని తెలిపారు.

అడ్రస్ లు సరిగ్గా ఫీడ్ చేయలేదని గుర్తించి, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. అడ్రస్ లో లేని వారు, చనిపోయిన వారికి సంబంధించి లిస్ట్ ఇప్పటికే పోలింగ్ స్టాఫ్ కి పంపామని చెప్పారు. వీరిపై విచారణ చేసి వీడియో గ్రాఫింగ్ తర్వాత మాత్రమే అనుమతి ఇస్తామని అన్నారు.

బోగస్ ఓట్లని చెబుతున్న వాటిని పరిశీలించి యూనివర్సిటీ సర్టిఫికెట్, అసిస్టేషన్ చేసి ఉందో లేదో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్ తో ఓటు హక్కు వినియోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రలోభాల పర్వంపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. వీటిని ఆయా జిల్లాల కలెక్టర్లకు విచారణకు పంపిస్తున్నామని తెలిపారు.

Pawan Kalyan : కాపులు పార్టీ నడపలేరని విమర్శించే వారికి గట్టిగా సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్