Pawan and chandrababu
AP Nominated Posts : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీకోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కాగా మంగళవారం ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొత్తం 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల లిస్ట్ ను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జిలు, ఒక క్లస్టర్ ఇంచార్జ్ కు చైర్మన్ పదవి వరించింది. ఆరుగురు యూనిట్ ఇంచార్జులకు పదవులు దక్కాయి.
20 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించిన కూటమి ప్రభుత్వం.. ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమించింది. అయితే, 20 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 16మంది టీడీపీ నేతలు, ముగ్గురు జనసేన నేతలు, ఒక బీజేపీ నేతకు అవకాశం దక్కింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు పదవులు కట్టబెట్టారు.
సామాన్య కార్యకర్తలకు పెద్దపీట
99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం
బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ లకు పెద్ద పీట
11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు
ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి
6 గురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు
20 కార్పొరేషన్లు కు… pic.twitter.com/oGfOcwHNTp
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2024