Women Police Unit : ఏపీలో మహిళా పోలీసు విభాగం

మొత్తం 5 విధాలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. నేరుగా నియామకాల ద్వారా 90 శాతం మహిళా పోలీసులను భర్తీ చేస్తారు.

women police unit in AP : ఏపీలో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు. సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరి ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 5 విధాలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. నేరుగా నియామకాల ద్వారా 90 శాతం మహిళా పోలీసులను భర్తీ చేస్తారు. మరో 5 శాతం మహిళా హోంగార్డులు.. గ్రామ, వార్డు వాలంటీర్ల నుంచి మరో 5 శాతం మందిని భర్తీ చేయనున్నారు.

అలాగే సచివాలయ మహిళా పోలీసులకు ప్రమోషన్లపై కూడా వివరణ ఇచ్చింది ప్రభుత్వం. మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, మహిళా పోలీస్ ఏఏస్ఐ, సీనియర్ మహిళా పోలీస్, మహిళా పోలీస్‌గా ఉద్యోగ కేటగిరీలు ఉంటాయని నోటిఫికేషన్‌లో ఏపీ హోంశాఖ పేర్కొంది. మహిళా పోలీసుగా కనీసం ఆరు సంవత్సరాలు సర్వీస్ చేస్తే సీనియర్ మహిళా పోలీసుకు అర్హత సాధిస్తారు.

Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

సీనియర్ మహిళా పోలీసుగా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేస్తే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు అర్హత సాధిస్తారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉంటే సబ్ ఇన్‌స్పెక్టర్‌కు అర్హత సాధిస్తారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా కనీసం ఐదేళ్లు పనిచేస్తే ఇన్‌స్పెక్టర్‌గా నాన్ గెజిటెడ్ పోస్టుకు అర్హత సాధిస్తారు.

ట్రెండింగ్ వార్తలు