×
Ad

AndhraPradesh : ఏపీలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాఠశాలలు, కళాశాలల్లో చదివేవారికి పూర్తిగా ఉచితం.. మంచి ఛాన్స్

AndhraPradesh Aadhaar special camps : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కాలేజీలు, స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది.

Students ((Image Credit To Original Source))

  • ఏపీలోని స్కూల్స్, కాలేజీల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు
  • ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు క్యాంపుల నిర్వహణ
  • ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలంటున్న అధికారులు

AndhraPradesh Aadhaar special camps : ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కాలేజీలు, స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బయో మెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read : Bhogapuram Airport : ఎగిరే చేప డిజైన్.. 200 విమానాలు ల్యాండయ్యే సామర్థ్యం.. భారీ తుఫాన్లు తట్టుకునే కెపాసిటీ.. భోగాపురం విమానాశ్రయం ప్రత్యేకతలు మరెన్నో..

పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్ కార్డులు తీసుకుంటారు. అయితే, పిల్లల వయస్సు ఐదేళ్ల నుంచి 15ఏళ్ల మధ్య మారినప్పుడు వారి వేలిముద్రలు, కంటిపాప (ఐరిష్) వివరాలు కూడా మారుతాయి. ఈ మార్పుల వల్ల పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదులో సమస్య వస్తాయి. అప్పుడు పిల్లల ఆధార్ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఇబ్బందులను తొలగించడానికి జిల్లా, గ్రామ, వార్డు సచివాలయ విభాగం ప్రత్యేకంగా ఆధార్ అప్డేట్ క్యాంపులను నిర్వహిస్తోంది.

గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ క్యాంపులు జరుగుతున్నాయి. ఇంకా చాలా మంది పిల్లల ఆధార్ వివరాలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది. అందుకే మిగిలిపోయిన విద్యార్థుల కోసం పాఠశాలల్లోనే ఈ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 5.94లక్షల మంది మాత్రమే చేయించుకున్నారని తెలుస్తోంది. ఇంకా సుమారు 10లక్షల మందికిపైగానే బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ లో ఉందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 15 నుంచి 17ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారు జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చునని చెబుతున్నారు. విద్యార్థులు తమ సమీపంలోని స్కూల్, జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంపుకు హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ ఆధార్ అప్డేట్ చేయించుకోవడం పూర్తిగా ఉచితం. ఎక్కువ మంది విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోని పాఠశాలలకు అధికారులు ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.