Cm Chandrababu: రాజధానిలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు.. 24 గంటలు డెడ్ లైన్
చిన్న నిప్పు రవ్వ అంటుకునో, మరో చిన్న కారణంతోనో అంత స్థాయి ప్రమాదం అయ్యే అవకాశం లేదని చంద్రబాబు అన్నారు.
Cm Chandrababu: రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాజధానిలో పైపులు తగలబడిన అంశంపై డీజీపీ, ఇతర అధికారులకు గట్టి ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. 130, 140 డిగ్రీల వేడితో నిప్పు అంటిస్తే తప్ప ఆ పైపులు తగలబడవని చెబుతున్నారని.. దీన్ని బట్టి చూస్తే చిన్న నిప్పు రవ్వ అంటుకునో, మరో చిన్న కారణంతోనో అంత స్థాయి ప్రమాదం అయ్యే అవకాశం లేదని చంద్రబాబు అన్నారు. దీని వెనుక విద్రోహ చర్య ఉందని నమ్మాల్సి వస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో 24 గంటల్లో ఘటనకు కారణాలు వెలికితీయాలని, కేసును ఎస్టాబ్లిష్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికి రాజధానిలో మూడు ప్రమాదాలు జరిగాయన్నారు. వీటిని లింక్ చేసి దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని డీజీపికి, ఎస్పీకి స్ట్రాంగ్ గా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 24 గంటల్లో ఘటనకు కారణాలు తెలుసుకుని తన దగ్గరికి రావాలని వారిని ఆదేశించారు చంద్రబాబు.
Also Read: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం.. అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ..!
