AP Government: నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే ఉపాధి అవకాశం.. వీరు మాత్రమే అర్హులు
AP Government : ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది.
- Harish Thanniru
- Updated on- September 3, 2026 / 12:15 PM IST
AP Government Generic Medicine Employment for Unemployed Youth
AP Government : ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జనరిక్ మందుల లభ్యతను పెంచడానికి.. అదే సమయంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిచండానికి చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపుల (Generic medicine shops) ను ప్రారంభించడం ద్వారా పేదలు, మధ్య తరగతి కుటుంబాలవారి వైద్య ఖర్చులను తగ్గించేందుకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకురానుంది.
Also Read – Disha Salian : దిశా సాలియన్ కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా, రాయితీ రుణ పథకం కింద జనరిక్ మందులు షాపులు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి రూ.7.92కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 198 జనరిక్ మందుల షాపులను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ-ఏ, బీ, డీ, ఈ.. ఇలా కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో జనరిక్ మందుల షాపు ఏర్పాటుకు రూ. 8లక్షల వరకు వ్యయం అవుతుంది. ఇందులో 50శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన రూ. 4లక్షలు కూడా బ్యాంకు ద్వారా రుణం రూపంలో ఇప్పిస్తారు. కొత్తగా షాపులు ఏర్పాటు చేసుకునే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించనున్నారు.
దుకాణానికి గదిని సమకూర్చుకునే బాధ్యత లబ్ధిదారులదే. ఫర్నిచర్, మందుల కొనుగోలుకు బ్యాంకు నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇప్పిస్తారు. తరువాత మిగతా మొత్తాన్ని అందజేస్తారు. ప్రభుత్వం ఇచ్చే 50శాతం రాయితీని బ్యాంకుకే జమ చేస్తుంది.
