AP Govt DSC 2026 Notification
AP Govt DSC 2026 Notification: ఏపీలోని డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నోటిఫికేషన్ విడుదల చేసిన మూడు నెలలకే అంటే మార్చిలోనే డీఎస్సీ పరీక్ష (AP Govt DSC 2026 Notification) కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యాశాఖపై అధికారులతో నిర్వహించిన సమీక్షలతో లోకేశ్ స్పష్టం చేశారు.
ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల విద్యపై మంత్రి నారా లోకేశ్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబరు చివరి వారంలో టెట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్పెషల్ డీఎస్సీలో 2,260 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించిందని తెలిపారు. టెట్, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.
అదేవిధంగా టెన్త్ విద్యార్థులకు డిసెంబరు నెల చివరి నాటికి సిలబస్ పూర్తిచేసి, వంద రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని అధికారులకు మంత్రి నారా లోకేశ్ సూచించారు. అంతేకాదు.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యప్రణాళిక సంస్కరణలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.
నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆరోజు నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సభాపతితోపాటు నేనూ హాజరవుతానని లోకేశ్ చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించాలని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారుకు సూచించారు.
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించాను. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి… pic.twitter.com/hXrrwRL3MG
— Lokesh Nara (@naralokesh) October 9, 2025