Sangam Dairy
AP government key orders on Sangam Dairy : సంగం డెయిరీ అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేశారు.
డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి జాయింట్ కలెక్టర్ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధూళిపాళ్ల వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
అయితే హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విచారణ జరుగుతుండగా దురుద్ధేశ్యంతోనే జీవో ఇచ్చారని ఆరోపించింది.