Andhra pradesh : IPS అధికారి AB వెంకటేశ్వర రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం మెమో జారీ చేసింది.

Notices To Ips Officer Ab Venkateswara Rao
notices to IPS officer AB Venkateswara rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. గత నెల (March)21వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావు పెట్టిన ప్రెస్ మీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ చీఫ్ సెక్రటరీ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా ABV మీడియా సమావేశం పెట్టారని నోటీస్ ఇచ్చారు.
కాగా ABV మీడియా సమావేశంలో పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై ఆ రోజు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పై వేర్ కొనలేదని స్పష్టం చేశారు. 2019 మే నెల వరకూ తనకు తెలిసినంత మేరకు అప్పటి ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్ ను కొనలేదని మీడియాతో తెలిపారు.
దీంతో ప్రభుత్వ పదవిలో ఉండి..ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ నోటీస్‌లో సీఎస్ నోటీజులో పేర్కొన్నారు. మెమో అందిన వారంలోగా వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వం నోటీస్ పంపడం గమనించాల్సిన విషయం. కాగా..ఏబీ వెంకటేశ్వరరావు కొందరు వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేయడానికి చీఫ్ సెక్రటరీ అనుమతి కూడా కోరినట్లుగా సమాచారం.