AP Government : కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు

కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. వైద్య సిబ్బంది, పీపీఈ, డిస్ ఇన్ఫెక్షన్, టెస్టులు, మందులు, న్యూట్రిషన్ ఖర్చులతో కలిపి ఎంత తీసుకోవాలన్న దానిపై ధరలు నిర్ణయించింది.

AP Government Prices fixed for the treatment of covid : కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. వైద్య సిబ్బంది, పీపీఈ, డిస్ ఇన్ఫెక్షన్, టెస్టులు, మందులు, న్యూట్రిషన్ ఖర్చులతో కలిపి ఎంత తీసుకోవాలన్న దానిపై ధరలు నిర్ణయించింది.

అత్యవసరం కాని కోవిడ్ చికిత్సకు రోజుకు రూ.3,250 వసూలు చేయాలని సూచించింది. అత్యవసరమైన కోవిడ్ చికిత్స… ఐసీయూ (వెంటిలేటర్ మరియు ఎన్ ఐబీ లేకుండా)కు రూ.5,480.

నోటిలో పైపు లేకుండా వెంటిలేర్ ద్వారా ఆక్సిజన్ అందించే వ్యవస్థతోకూడిన చికిత్సకు రూ.5,980. నోటిలో పైపు ద్వారా వెంటిలేటర్ తో ఆక్సిజన్ అందించే వ్యవస్థతో చికిత్సకు రూ.9,580 వసూలు చేయాలని తెలిపింది.

రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్న స్థితికి వెంటిలేటర్ లేకుండా చేసే చికిత్సకు రూ.6,280. రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్న స్థితికి వెంటిలేటర్ తో చేసే చికిత్సకు రూ.10,380.

రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండి బీపీ, పల్స్ పడిపోయే పరిస్థితి ఉండి.. రెండు లేదా అంతకు మించి ముఖ్య శరీర భాగాల పనిచేయకపోతే వెంటిలేటర్ తో అందించి చికిత్సకు రూ.10,380.
యాంటీ వైరల్ ఔషధం ఒక్క డోస్ కు రూ.2,500 వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.

ట్రెండింగ్ వార్తలు