×
Ad

2026 Holidays List: పండగే పండగ.. 2026లో ప్రభుత్వ సెలవులు ఇవే.. లిస్ట్ విడుదల చేసిన ఏపీ సర్కార్..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026 ఏడాదికి సంబంధించి అధికారిక సెలవుల జాబితాను ప్రకటించింది.

2026 Holidays List: త్వరలో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీంతో అందరి దృష్టి కొత్త సంవత్సరంలో సెలవులపై పడింది. ఎందుకంటే.. హాలీడేస్ కు అనుగుణంగా టూర్లు, ట్రిప్పులు ప్లాన్ చేసుకోవచ్చని. ఏ రోజున ఏ సెలవు ఉంటుందో తెలిస్తే.. అందుకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోచ్చని భావిస్తున్నారు.

అందుకే, 2026లో ప్రభుత్వ సెలవులు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు హాలీడేస్ ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు అంతా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026 ఏడాదికి సంబంధించి అధికారిక సెలవుల జాబితాను ప్రకటించింది. 2026లో మొత్తం 24 పబ్లిక్‌ (సాధారణ) హాలీడేస్‌ ఉండగా, 21 ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగులు, ప్రజలు తమ కార్యకలాపాలను ముందుగా ప్రణాళిక చేసుకునేందుకు వీలుగా ఈ లిస్ట్ ను విడుదల చేసింది ప్రభుత్వం.

ప్రధాన పండుగలు, జాతీయ దినోత్సవాలకు అనుగుణంగా హాలిడేస్ ను ఖరారు చేసింది. జనవరిలో భోగి, సంక్రాంతి, కనుమ, రిపబ్లిక్ డేలతో సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చిలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబర్‌లో వినాయక చవితి, అక్టోబర్‌లో దుర్గాష్టమి, విజయదశమి, నవంబర్‌లో దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగలకు సెలవులు ప్రకటించారు.

2026లో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇలా..

1. భోగి -జనవరి 14
2. మకర సంక్రాంతి – జనవరి 15
3. కనుమ – జనవరి 16
4. రిపబ్లిక్‌ డే- జనవరి 26
5. మహా శివరాత్రి – ఫిబ్రవరి 15
6. హోలీ – మార్చి 3
7. ఉగాది – మార్చి 19
8. రంజాన్‌ – మార్చి 20
9. శ్రీరామ నవమి – మార్చి 27
10. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్ 3
11. బాబు జగ్జీవన్‌రావ్‌ జయంతి – ఏప్రిల్ 5
12. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి – ఏప్రిల్ 14
13. బక్రీద్ – మే 27
14. మొహర్రం – జూన్ 25
15. ఇండిపెండెన్స్‌ డే – ఆగస్టు 15
16. వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21
17. మిలాద్ ఉన్ నబీ – ఆగస్టు 25
18. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4
19. వినాయక చవితి – సెప్టెంబర్‌ 14
20. గాంధీ జయంతి – అక్టోబర్‌ 2
21. దుర్గాష్టమి – అక్టోబర్‌ 18
22. విజయ దశమి – అక్టోబర్‌ 20
23. దీపావళి – నవంబర్‌ 8
24. క్రిస్మస్‌ – డిసెంబర్‌ 25

Also Read: రిటైర్మెంట్ నాటికి రూ. 10 కోట్లు సంపాదించడం ఎలా? ఏ వయస్సులో ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలి? పూర్తి లెక్కలివే..!