SIP Calculator : రిటైర్మెంట్ నాటికి రూ. 10 కోట్లు సంపాదించడం ఎలా? ఏ వయస్సులో ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలి? పూర్తి లెక్కలివే..!

SIP Calculator : రిటైర్మెంట్ సమయంలో రూ. 10 కోట్ల కార్పస్‌ను సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు. సరైన వయస్సులో SIPలో పెట్టుబడి ద్వారా భారీ మొత్తంలో కోట్ల రూపాయలను సంపాదించుకోవచ్చు.

SIP Calculator : రిటైర్మెంట్ నాటికి రూ. 10 కోట్లు సంపాదించడం ఎలా? ఏ వయస్సులో ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలి? పూర్తి లెక్కలివే..!

SIP Calculator

Updated On : December 5, 2025 / 6:54 PM IST

SIP Calculator : రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ఏ వయస్సులో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలి? పెట్టుబడి ద్వారా రూ. 10 కోట్లు ఎలా సంపాదించుకోవాలి? ఇది సాధ్యమేనా? నిజంగా సాధ్యమే.. మీరు చేయాల్సిందిల్లా.. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ముందు నుంచే ఉండాలి. దీనికి ఒకే ఒక ఫార్ములా ఉంది.. అది మీరు ఎంత తొందరగా పెట్టుబడి పెడితే అంత మంచిది. తక్కువ పెట్టుబడితో కూడా భారీ మొత్తంలో కార్పస్‌ను పొందవచ్చు.

వాస్తవానికి, సమయం అనేది మీ చిన్న SIP కూడా (SIP Calculator) కోట్లుగా మార్చగలదు. కానీ, మీరు క్రమం తప్పకుండా SIPలో పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. అలా చేస్తే సగటున 12శాతం వార్షిక రాబడిని పొందవచ్చు. తద్వారా 60 ఏళ్ల వయస్సులోపు రూ. 10 కోట్ల కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు. 25 ఏళ్ల నుంచి 30, 35, 40 ఏళ్ల వయస్సు గల పెట్టుబడిదారులకు SIPలో పెట్టుబడి ఎలా పడితే కోట్లు సంపాదించుకోవచ్చో తెలుసుకుందాం.

వడ్డీపై వడ్డీనే సంపాదిస్తుంది :
ఈ పెట్టుబడి ప్రపంచంలో వడ్డీపై వడ్డీని సంపాదించడం అనేది పెద్ద మ్యాజిక్. మీ డబ్బును చాలా కాలం పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా చిన్న పెట్టుబడులు కూడా భారీ మొత్తంలో రాబడిగా మారతాయి. అందుకే నిపుణులు పెట్టుబడి పెట్టేందుకు మొదటి రూల్ సూచించారు.

అదే.. తక్కువ వయస్సులోనే పెట్టుబడి పెట్టడం. రెండవది అందుకు తగిన సమయం ఇవ్వడమని అంటారు. వివిధ వయస్సులలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. ఎంత మొత్తంలో రాబడిని పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం..

1. మీకు 25 ఏళ్లు ఉంటే (సమయం: 35 ఏళ్లు)
పెట్టుబడి పెట్టడానికి ఇదే బెస్ట్ టైమ్. సంపదను కూడబెట్టుకునేందుకు మీకు పూర్తి 35 ఏళ్లు ఉన్నాయి.
టార్గెట్ : రూ. 10 కోట్లు
నెలవారీ పెట్టుబడి (SIP) : సుమారు రూ. 19,500
పెట్టుబడి ఫండ్ : రూ. 79.8 కోట్లు
సంపద లాభం : రూ. 9.7 కోట్లు
మెచ్యూరిటీ ఫండ్ : రూ. 10.5 కోట్లు
బెనిఫిట్ : చిన్న వయస్సులోనే మొదలుపెడితే మీపై తక్కువ ఒత్తిడి పడుతుంది. కాంపౌండింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Maruti Suzuki Discounts : మారుతి డిసెంబర్ ధమాకా ఆఫర్లు.. ఈ మోడల్ కార్లపై రూ. 2లక్షలకు పైగా డిస్కౌంట్లు.. ఏ కారు కొంటారో కొనేసుకోండి!

2. మీకు 30 ఏళ్లు ఉంటే (సమయం : 30 ఏళ్లు)
మీరు 5 ఏళ్లు ఆలస్యం చేస్తే పెట్టుబడి మొత్తం దాదాపు రెట్టింపు అవుతుంది.
లక్ష్యం: రూ. 10 కోట్లు
నెలవారీ పెట్టుబడి (SIP) : సుమారు రూ. 33,500
సంపద లాభం : రూ. 9 కోట్లు
మెచ్యూరిటీ ఫండ్ : రూ. 10.2 కోట్లు

3. మీ వయస్సు 35 ఏళ్లు అయితే (సమయం : 25 ఏళ్లు)
మీకు ఇంకా 25 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
టార్గెట్ : రూ. 10 కోట్లు సంపాదన
నెలవారీ పెట్టుబడి (SIP) : సుమారు రూ.60,000
సంపద లాభం : రూ. 8.4 కోట్లు
మెచ్యూరిటీ ఫండ్: రూ.10.2 కోట్లు
టిప్ : మీరు ఒకేసారి అంత పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టలేకపోతే.. ‘స్టెప్-అప్ SIP’ని ఎంచుకోండి. ప్రతి ఏడాదిలో పెట్టుబడి మొత్తాన్ని 10శాతం పెంచండి.

4. మీ వయస్సు 40 ఏళ్లు అయితే (సమయం : 20 ఏళ్లు)
మీరు 40 ఏళ్ల వయసులో రూ. 10 కోట్లు సంపాదించాలనుకుంటే చాలా క్రమశిక్షణతో ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి.
మొత్తం రాబడి : రూ. 10 కోట్లు
నెలవారీ పెట్టుబడి (SIP) : సుమారు రూ. 1,01,000
మీరు 25 ఏళ్ల వ్యక్తి కన్నా ప్రతి నెలా 6 రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

మీరు రూ. 10 కోట్ల కార్పస్‌ కోసం కాలక్రమేణా పెట్టుబడి పెడితే.. పెట్టుబడి మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. మీరు కాంపౌండింగ్ పూర్తి బెనిఫిట్స్ పొందుతారు. అయితే, మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచినప్పటికీ కాంపౌండింగ్ బెనిఫిట్స్ పొందలేరు.

Disclaimer : ఈ పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు SIPలో పెట్టబడి పెట్టాలనుకుంటే ముందుగా మీకు తెలిసిన ఆర్థిక నిపుణులను సంప్రదించండి.