Mini Trucks On Subsidy : సబ్సిడీ 30 నుంచి 60శాతానికి పెంపు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలు, ఈబీసీలకు మినీ ట్రక్కులను సబ్సిడీపై అందజేయనుంది.

Mini Trucks On Subsidy : సబ్సిడీ 30 నుంచి 60శాతానికి పెంపు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Mini Trucks On Subsidy

Updated On : July 20, 2021 / 11:21 AM IST

Mini Trucks On Subsidy : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలు, ఈబీసీలకు మినీ ట్రక్కులను సబ్సిడీపై అందజేయనుంది. సబ్సిడీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. 30 నుంచి 60శాతానికి పెంచింది.

రాష్ట్రంలో బీసీలకు 3,800 మినీ ట్రక్కులు, ఈబీసీలకు 1,800 మినీ ట్రక్కులు.. మొత్తం 5,600 మినీ ట్రక్కులను సబ్సిడీపై ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వారి (ఈబీసీ) అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ)లను మంజూరు చేసింది. బీసీలు, ఈబీసీల సంక్షేమం, స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేశారు.

మొత్తం యూనిట్‌ (మినీ ట్రక్కు) వ్యయంలో 10 శాతం లబ్ధిదారుడు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతాన్ని ఎంపిక చేసిన బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. 90 శాతం అప్పులో లబ్ధిదారుడు 60 శాతం సబ్సిడీగా పోనూ మిగిలిన 30 శాతాన్ని 72 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించాలి.

కాగా, ఇప్పటివరకు లబ్ధిదారుడికి ఇస్తున్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లబ్ధిదారుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. లబ్ధిదారుడికి సబ్సిడీగా ఇచ్చిన 60 శాతాన్ని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది.