CM Jagan
Andhra Pradesh Input Subsidy : వైసీపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం జగన్ ఇవాళ రైతుల ఖాతాల్లో ఇన్ ఫుట్ సబ్సిడీని జమ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆయన బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. గత ఏడాది ఖరీఫ్ లో ఏర్పడిన కరువు, మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన 11లక్షల 59వేల మంది రైతులకు 1294 కోట్లకుపైగా నగదును పంపిణీ చేయనున్నారు.
Also Read : Underwater Metro : భారత్‌లో నదీగర్భంలో నడిచే తొలి మెట్రో రైలు.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?
గతేడాది వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి లక్షలాది మంది రైతులు నష్టపోయారు. అదే సమయంలో మిచాంగ్ తుఫాన్ తో అకాల వర్షాలు కురిసి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కరువు, తుపాన్ నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని జగన్ ఇవాళ అందజేయనున్నారు. ఏపీలో 103 మండలాలు కరువు మండలాలుగా కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రటకించింది. గత డిసెంబర్ మిచాంగ్ తుఫాన్ తో 22 జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసి 6లక్షల65వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. తుఫాన్ కారణంగా 4లక్షల 61వేల మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వం లెక్క తేల్చింది.