Ysr Asara
YSR Asara : స్వయం సహాయక సంఘాల మహిళల (డ్వాక్రా మహిళలు) ఖాతాల్లో ఆసరా పథకం రెండో విడత నిధులు జమకానున్నాయి. అక్టోబర్ 7న డ్వాక్రా మహిళల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. సీఎం క్యాంపు ఆఫీసు నుంచి జగన్ బటన్ నొక్కి ఈ మొత్తాలను మహిళల అకౌంట్లకు బదిలీ చేయనున్నారు. నిధులు కొరతతో సెప్టెంబర్ లో చేపట్టాల్సిన ఈ పథకాన్ని అక్టోబర్ 7కి వాయిదా వేసింది ప్రభుత్వం.
Android Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..
వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా 8,42,000 డ్వాక్రా సంఘాల్లోని 78, 75, 599 మంది మహిళలు లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 6వేల 470 కోట్ల నిధులు కేటాయించింది.
ఎన్నికల హామీ మేరకు 2019 ఏప్రిల్ 11వ తేదీ ముందు వరకూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందంటూ సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు మొత్తం రూ.25,579 కోట్ల రుణాలను నాలుగు విడతల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతగా గతేడాది సెప్టెంబర్ 11న రూ.6వేల 330 కోట్ల మొత్తాన్ని డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలోనే చెల్లించాలని భావించినా.. నిధులు కొరత కారణంగా ఆసరా రెండో విడత అమలును అక్టోబర్ 7కు వాయిదా వేశారు.
అక్టోబర్ 3, 4, 5, 6న సెర్ప్, మెప్మా అధికారులు గ్రామాలు, వార్డులవారీగా సమావేశాలు నిర్వహించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా సంఘాలకు ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు చెల్లిస్తుందన్న వివరాలను తెలియజేస్తారు. అక్టోబర్ 8 నుంచి 17 వరకు పది రోజుల పాటు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక మండలంలో వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి నిర్వహిస్తారు.