Covid Victims : మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..కోవిడ్‌‌తో చనిపోయిన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు

కరోనా మృతుల కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది...

Covid Victims : మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..కోవిడ్‌‌తో చనిపోయిన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు

Covid india

Supreme Court Covid victims : కరోనా మృతుల కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కోవిడ్ తో చనిపోయినట్లు ధృవీకరణ పత్రం లేకున్నా…పరిహారం ఇవ్వాలని సూచించింది. మృతుల కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ లో కరోనా మొదటి, సెకండ్ వేవ్ లతో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. వేలాదిమంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు.

Read More : Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‌ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్ట పరిహారం అనే అంశాన్ని కేంద్రమే నిర్ణయించుకుని ఎంత ఇస్తారు? అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించాలని ఇటీవలే ఆదేశించింది.

Read More : Samantha: ముందు నన్ను నేను మార్చుకోవాలి.. సామ్ ట్వీట్ వైరల్!

విపత్తు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్రం తన వాదనలు వినిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12 ప్రకారం పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF) నుంచి పరిహారాన్ని చెల్లించాలని కేంద్రం స్పష్టం చేసింది.