Samantha: ముందు నన్ను నేను మార్చుకోవాలి.. సామ్ ట్వీట్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే యంగ్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా నాగ చైతన్యలు తామిద్దరం విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశం..

Samantha: ముందు నన్ను నేను మార్చుకోవాలి.. సామ్ ట్వీట్ వైరల్!

Samantha

Updated On : October 4, 2021 / 1:35 PM IST

Samantha: తెలుగు సినీ ఇండస్ట్రీలోనే యంగ్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా నాగ చైతన్యలు తామిద్దరం విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఇదే కథలు కథలుగా మారింది. ఎవరికి వారు దీనికి కారణమేంటని.. దీని వెనుకున్న రహస్యమేంటని ఛేదించే ప్రయత్నాలు కూడా చేసి అలసిపోయారు.

Naga Chaitanya-Samantha: సోషల్ మీడియా సాక్షిగా చై.. సామ్.. సిద్దార్థ్.. జుకల్కర్‌!

కానీ, అసలు విడిపోయిన ఆ జంట మాత్రం ఆ బాధ నుండి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించే పనిలో ఉన్నారు. విడాకుల ప్రకటన తర్వాత మళ్ళీ చైతన్య సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా చూసి బాగుందని ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తే.. సమంతా కూడా ఇకపై తన కెరీర్ మీద మళ్ళీ దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యేలా పోస్టులు చేసింది. నిన్నటి వరకు కాస్త ఎమోషనల్ పోస్టులు పెట్టిన సామ్ ఇప్పుడు ఫిలాసఫీని కలగలిపిన కంటెంట్ తో పోస్టులు పెట్టింది.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

‘ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి.. నా పడకగదిని నేను సిద్ధం చేసుకోవాలి.. ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి.. మధ్యాహ్నం వరకూ నిద్రపోకూడదు.. ఇక, పగటి కలలు కనడం మానేసి.. చేయాల్సిన పనులపైనే దృష్టి పెట్టాలి’ అని ఆమె ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సామ్‌ చేసిన మొదటి పోస్ట్‌ ఇదే కాగా ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్‌గా మారింది.