free tabs 8th class students
8th Class Students Free Tabs : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల 18 వేల ట్యాబ్ లను పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 21వ తేదీన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రామాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. జనవరి 22 నుంచి 28వ తేదీ వరకు విద్యార్థులకు ట్యాబ్ లు అందజేయనున్నారు.
Andra pradesh Govt : గవర్నమెంట్ స్కూల్స్‌లో సెమిస్టర్ విధానం .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
దీని కోసం రాష్ట్రంలో మొత్తం 676 మండల డెలివరీ పాయంట్లను ఏర్పాటు చేశారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల సమక్షంలో ట్యాబ్ లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.