Andra pradesh Govt : గవర్నమెంట్ స్కూల్స్‌లో సెమిస్టర్ విధానం .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Andra pradesh Govt : గవర్నమెంట్ స్కూల్స్‌లో సెమిస్టర్ విధానం .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

semester system in AP Govt school

Andra pradesh Govt : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ క్లాసుల వరకు రెండు సెమిస్టర్ల విధానాన్ని తీసుకురానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

2024-25 నుంచి 10th క్లాసులో కూడా ఈ సెమిస్టర్‌ విధానం అమలు చేయనున్నామని ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఆదేశాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ఆర్జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సెమిస్టర్ విధానానికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

కాగా..ఏపీలో ప్రాధమిక విద్య (Primary education)లో సెమిస్టర్‌ విద్యావిధానం తీసుకురావటం ఇదే తొలిసారి. సీఎం జగన్ ప్రభుత్వం దీన్ని అమలులోకి తీసుకురానుంది.కాగా..దీనికి సంబంధించి టెక్స్ బుక్స్ ను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందజేయనున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవటానికి కూడా ఓ కారణం ఉందని చెబుతున్నారు అధికారులు. అదేమంటే ఇలా సెమిస్టర్ల వారీగా పుస్తకాలు అందజేయటం వల్ల విద్యార్దులకు పుస్తకాలు మోసే బరువు భారం చాలావరకు తగ్గుతుందని చెబుతున్నారు.