AP Govt : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లక్షలాది పేద కుటుంబాలకు లబ్ధి.. ఇకనుంచి వాటిని దర్జాగా అమ్ముకోవచ్చు..
AP Govt : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు శుభవార్త చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లక్షలాది మంది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
- Harishth Thanniru
- Published On : April 9, 2026 / 07:17 AM IST
AP Govt
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
- 2016ముందు ప్రభుత్వం ఇంటి పట్టా పొందితే అమ్మకొనేందుకు వెసులుబాటు
- ఈనాం భూములకు 22ఎ నుంచి విముక్తి
- ఫ్రీహోల్డ్‌లోని లక్షల ఎకరాలకు త్వరలో యాజమాన్యం హక్కులు
AP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాలకు మేలు జరగనుంది.
Also Read : AP Govt : ఏపీలోని పేదలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఐదు లక్షల మందికి లబ్ధి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు శుభవార్త చెప్పారు. 2016కు ముందు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇంటి పట్టా పొందినవారికి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2016కు ముందు పట్టా పొందిన వారు దానిని అమ్ముకునేందుకు, రిజిస్ట్రేషన్ చేసే హక్కు కల్పిస్తామన్నారు. అంతేకాదు ఈ పట్టాలను గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 75లక్షల మంది పేదల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
1.37లక్షల ఎకరాల విలేజి సర్వీస్ ఈనాం భూములను 22ఎ జాబితా నుంచి తొలగించే ప్రతిపాదనకూ సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారు. మరో లక్ష ఎకరాల ఈనాం భూములకూ విముక్తి కల్పించనున్నారు. సర్వీస్ ఈనాం భూములకు సంబంధించి 2019లో టీడీపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. తాజాగా.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలేజీ సర్వీస్ ఈనాం విభాగంలోని 1.37లక్షల ఎకరాల భూములకు 22ఎ జాబితా నుంచి విముక్తి కల్పిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానుంది.
ఫ్రీహోల్డ్ కింద రిజిస్ట్రేషన్లు నిలిచిన 9.25లక్షల ఎకరాలకు సంబంధించి భూ యాజమానులకు త్వరలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫ్రీహోల్డ్ కింద మొత్తం 13.59లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. వీటిలో 9.25లక్షల ఎకరాలకు త్వరలో ప్రభుత్వం విముక్తి కల్పించనుంది. మిగిలిన వాటిని పరిశీలించిన తరువాత అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
