ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరులు వేయనుంది. రేటు కాంట్రాక్టు విధానంలో బోర్లు తవ్వేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియోజకవర్గానికి ఒక బోరువెల్ మెషన్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెండర్లు దాఖలు కాకపోవడంతో రేట్ కాంట్రాక్ట్ విధానంలో బోర్లు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది.
రైతులకు అవసరమైన ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉన్న చోట ఉచితంగా నియోజకవర్గాల వారీగా బోరులు వేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ వెల్ ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోకవర్గాల్లో ఒక్కో నియోజవర్గానికి చొప్పున బోర్ వెల్ మిషన్ కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి రేటు కాంట్రాక్ట్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం బోర్ వెల్ మిషన్లను కొనుగోలు చేయనుంది.
Read: మాణిక్యాలరావుకు కరోనా