ఏపీలో మూడు మెగా ఇండస్ట్రీస్‌కు గ్రీన్ సిగ్నల్

AP CM: రాష్ట్రంలో మూడు మెగా ఇండస్ట్రీల ఏర్పాటుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. రూ.16వేల 314 కోట్ల పెట్టుబడులు వచ్చి, సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకొస్తున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రపోజల్స్‌పై మంగళవారం క్యాంపు ఆఫీసులో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం జగన్‌ అధ్యక్షత వహించి అధికారులతో మాట్లాడారు.

ఇంటెలిజెంట్‌ సెజ్‌, అదానీ డేటా సెంటర్‌, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రపోజల్స్‌ను ఆమోదించారు. పరిశ్రమలు కోరుతున్న రాయితీలు, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. కాలుష్య రహిత పరిశ్రమలకే విశాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ ఇదే కావడం గమనార్హం.



ఈ మీటింగ్‌లో అప్రూవల్ దక్కించుకున్న ఇండస్ట్రీస్..
* చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ సంస్థకు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ లిమిటెడ్‌ (చెప్పుల తయారీ) ఏర్పాటు ద్వారా రెండుదశల్లో రూ.700 కోట్ల పెట్టుబడి వస్తుంది. సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుంది. కడపజిల్లాలోనూ మరో సెజ్‌ ఏర్పాటుచేసి, 2వేల మందికి ఉపాధి కల్పించనున్నారు.
* అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్‌ హైవే టైర్ల తయారీ సంస్థ రూ.980 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2వేల మందికి ఉపాధి కల్పిస్తుంది.
* విశాఖలోని మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ బిజినెస్‌ పార్కు, రిక్రియేషన్‌ సెంటర్‌తో పాటు నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. వాటి ద్వారా రూ.14వేల 634 కోట్ల పెట్టుబడులను సంస్థ పెట్టనుంది. సుమారు 24వేల990 మందికి ఉపాధి కల్పిస్తుంది.
https://10tv.in/kinetic-green-likely-to-set-up-production-unit-in-andhra-pradesh/
మూడు మెగా ఇండస్ట్రీలకు గ్రీన్ సిగ్నల్:
ఈస్ట్ గోదావరి జిల్లాలోని బిర్లా గ్రూప్‌కు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, చెన్నై రైల్‌ కోచ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, గ్రీన్‌లాం ప్లైవుడ్‌ తయారీ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రపోజల్స్‌ను అధికారులు ఎస్‌ఐపీబీ జాబితాలో చేర్చారు. వాటిపై చర్చించినా.. కొన్ని అంశాల దృష్ట్యా ఆమోదాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఏటా కనీసం 2వేల మందికి శిక్షణనిచ్చేలా విశాఖలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన టెక్నికల్ యూనివర్సిటీని ఏర్పాటుచేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కృత్రిమ మేథా (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), రోబోటిక్స్‌ వంటి అత్యాధునిక అంశాల్లో అక్కడ శిక్షణనివ్వాలన్నారు. ఐటీ విధానంపై అధికారులతో పాటు క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు.



ఎయిర్‌పోర్టుల డెవలప్‌మెంట్‌పై డిస్కషన్:
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. రాష్ట్రంలో ప్రపోజల్స్ పెట్టిన విమానాశ్రయాల ప్రస్తుత పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు అడిగారు. గన్నవరం, కడప విమానాశ్రయాల విస్తరణకు భూసేకరణపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.



భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆర్గనైజేషన్ కార్యకలాపాలను వివరించారు. దీని కోసం మరో 98 ఎకరాలను సేకరించాల్సి ఉందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల కోసం సేకరించాల్సిన భూముల పెండింగ్‌ అంశాలను వివరించారు.