Sankranti Holidays: ఎప్పుడెప్పుడు సంక్రాంతి పండగ సెలవులు వస్తాయా, ఎంజాయ్ చేద్దామా అని బడి పిల్లలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు చేసింది. మొత్తం 9 రోజుల పాటు పండగ సెలవులు ఇచ్చింది. జనవరి 10 నుండి జనవరి 18 వరకు హాలిడేస్ ఇచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
వచ్చే ఏడాది మొదటి నెలలోనే పండుగ సెలవులు వచ్చేశాయి. మొత్తం 9 రోజుల పాటు హాలిడేస్ ఉన్నాయి. దీంతో సెలవులను ఎంజాయ్ చేయడానికి పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ప్లాన్ చేసుకోవచ్చు. చక్కగా ఎక్కడికైనా టూర్ కి వెళ్లొచ్చు. ఏడాది ఆరంభంలోనే ఇలాంటి సుదీర్ఘ సెలవులు దొరకడం వల్ల పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికో, విహార యాత్రలకో ప్రణాళిక చేసుకునే వీలుంటుంది.
కాగా, తెలుగు వారు జరుపుకునే అతి ముఖ్యమైన, అతి పెద్ద పండగ సంక్రాంతి. మూడు రోజుల పాటు ముచ్చటగా జరుపుకునే పండుగ ఇది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో ఊళ్లన్నీ కళకళలాడుతాయి. ఇక పల్లెల్లో పండగ సందడి మరో లెవల్ లో ఉంటుంది. ఈ సెలవుల్లో ఎంచక్కా సొంతూళ్లకు వెళ్లిపోయి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో గడపొచ్చు. వారి సమక్షంలో సంక్రాంతి పండుగను సరదాగా జరుపుకోవచ్చు. ఇందుకోసం ఈ సెలవులు బాగా యూజ్ అవుతాయని విద్యార్థులు అంటున్నారు.
Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం..