సీఐడీ మాజీ ఛీప్ సంజయ్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ జీవో ఆర్టీ నంబర్ 1028ను జారీ చేశారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సంజయ్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Read: ఈ ఆరోపణ నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం: నారా లోకేశ్
ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సర్వీసులలో ఏడీజీగా ఉన్నప్పుడు నిధులను దుర్వినియోగం చేసినందుకు సస్పెన్షన్‌ను పొడిగించారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ పేరిట నిధులు దుర్వినియోగం అయినట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం మరోసారి పేర్కొంది. సంజయ్ సస్పెన్షన్‌ను మరో 180 రోజులు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.