ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మరో అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రజలందరికీ ఉచితంగా హెల్త్ ఇన్సురెన్స్ వర్తింపచేసేలా ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ అయ్యాయి.
ఇక ఉన్నతస్థాయి భేటీలో దీనిపై అఫీషియల్‌గా నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, అలాగే, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్‌గా గుర్తించనున్నారు.
ఈ మేరకు టెండరుకు ఆహ్వానం పలకనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ మెడికల్ సర్వీస్ ట్రస్టు నుంచి సంవత్సరానికి రూ.25 లక్షల విలువైన చికిత్సను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవలు పూర్తిగా ఉచితం.
ఇప్పుడు ప్రవేశపెట్టనున్న కొత్త ఇన్సురెన్స్ విధానంలో వార్షిక పరిమితితో పాటు ఇతర షరతులు కూడా లేవు. అందరికీ ఫ్రీగా ఇన్సురెన్స్ సదుపాయం అందించేందుకు టెండరు డాక్యుమెంట్ రెడీ అయింది. ప్రతి ఫ్యామిలీకి ప్రస్తుతమున్న రూ.25 లక్షల వార్షిక పరిమితి మెడికల్ సర్వీసులు కొనసాగుతాయి.
అయితే, సంవత్సరానికి రూ.2.5 లక్షల మెడికల్ సర్వీసులు ఫ్రీగా అందించేలా టెండరు ఆహ్వానిస్తారు. అంతకుమించి చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ మెడికల్ సర్వీస్ ట్రస్టు ఇస్తుంది. హైబ్రిడ్ విధానంగా దీనికి పేరు పెట్టారు. సంవత్సరానికి రూ.2.5 లక్షలలోపు ఖర్చయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 97 శాతం వరకు ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ఇర చంద్రబాబు నాయుడి తుది నిర్ణయం తర్వాత ఏప్రిల్/మే నుంచే ఈ ఇన్సురెన్స్ విధానం అమలులోకి రావచ్చు. ఇప్పటికే ఏడాది ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వ్యక్తులకు ట్రస్టు ద్వారా ఫ్రీగా మెడికల్ సర్వీసులు దక్కుతున్నాయి.
మొత్తం 1.43 కోట్ల కుటుంబాలు ఆ లోపు ఆదాయంతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం 8.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇన్సురెన్స్ స్కీమ్ కింద సంవత్సరానికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ దాదాపు రూ.7,000 చొప్పున చెల్లిస్తున్నారు.
అలాగే, జర్నలిస్టులు సైతం ఈ ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే లిస్టులో ఉన్న వారిని మినహాయించి, మిగతా వారికి ఇన్సురెన్స్ విధానాన్ని అందించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి.