Champions Trophy 2025: మొట్టమొదటి మ్యాచ్‌లో గెలుపుపై రోహిత్ శర్మ కీలక కామెంట్స్.. ఆ ముగ్గురి గురించి ఏమన్నాడో తెలుసా?
అతడు బంగ్లాదేశ్‌తో ఆడిన తీరు తమను ఏమీ సర్‌ప్రైజ్‌కు గురి చేయలేదని చెప్పాడు.

Rohit Sharma
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడిన మొట్టమొదటి మ్యాచ్ ఇది. దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు.
మ్యాచ్ తర్వాత అతడు మాట్లాడుతూ.. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచులో శుభ్‌మన్ గిల్ 129 బంతుల్లో 101 పరుగులు (నాటౌట్), కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులు (నాటౌట్) చేశారు.
Also Read: గుడ్‌న్యూస్.. ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? దరఖాస్తు గడువును పొడిగించారు..
గిల్ ఆటతీరు గురించి రోహిత్ స్పందిస్తూ.. అతడి ఆటతీరు గురించి మనందరికీ తెలుసని చెప్పాడు. అతడు ముందు నుంచీ బ్రిలియంట్ ఆటగాడని, బంగ్లాదేశ్‌తో ఆడిన తీరు తమను ఏమీ సర్‌ప్రైజ్‌కు గురి చేయలేదని చెప్పాడు.
అతడు ఆటముగిసే వరకు ఆడిన తీరు అద్భుతమని రోహిత్ శర్మ అన్నాడు. ఒత్తిడిలోనూ గిల్, కేఎల్ రాహుల్ ఎంతో చక్కగా ఆడారని తెలిపాడు.
ఇటువంటి ఒత్తిడితో కూడిన ఆటను తాము గతంలోనూ చూశామని, గిల్, కేఎల్ రాహుల్ ఆటను ముగించి తీరు చాలా గొప్పగా ఉందని తెలిపాడు. షమీ 5 వికెట్లు తీయడం పట్ల కూడా రోహిత్ ప్రశంసలు గుప్పించాడు.
అతడి బౌలింగ్ తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. అతడిపై ఎల్లప్పుడూ నమ్మకం ఉంచుతామని, అందుకు తగట్టే అతడు బౌలింగ్ చేస్తాడని తెలిపాడు. అటువంటి బౌలర్ టీమ్‌కి అవసరమని చెప్పాడు.
రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీలో తమ తదుపరి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 23న దుబాయ్ వేదికగా జరగనుంది. టీమిండియా ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.