Mini Anganwadi
Mini Anganwadi : మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 4,687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం (Mini Anganwadi) పదోన్నతి కల్పించింది. ఈ మేరకు జీవో (GO) జారీ చేసింది. పదో తరగతి పాస్ అయినవారే ఇందుకు అర్హులుగా వెల్లడించింది.
మినీ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతికి అర్హతగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తద్వారా మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఇకపై రూ. 11,500 వేతనాన్ని అందుకోనున్నారు. ప్రస్తుతం మినీ అంగన్వాడీ కార్యకర్తలకు రూ. 7వేలు వేతనం అందుకుంటున్నారు. ఇప్పడు వేతనం పెంచడం ద్వారా మినీ అంగన్వాడీలు ఆర్థికపరంగా ప్రయోజనాలను పొందడానికి వీలుంటుంది.
Read Also : New Bar Policy : బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు పండగే.. దరఖాస్తు రుసుము రూ. 5 లక్షలకు తగ్గింపు..!
మరోవైపు.. మినీ అంగన్వాడీ కేంద్రాల విలీనం చేయాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న మినీ అంగన్వాడీలు, ఒక కిలోమీటర్ పరిధిలోని మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కలపాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ విలీనం కారణంగా విద్యార్థులు, కార్యకర్తలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు పొందవచ్చు.