Secretariat Employees : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయాల నుంచి ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. పని భారం తగ్గించేలా రేషనలైజేషన్ ఉంటుందని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఒక్కో సచివాలయానికి 7-8 పోస్టులు ఉంటాయన్నారు. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవని తేల్చి చెప్పారాయన. జిల్లా, మండల స్థాయి అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారని అన్నారు. సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
”గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని తొలగించబోము. ఎవరూ ఆందోళన చెందవద్దు. గ్రామ వార్డు సచివాలయాల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సచివాలయాల ద్వారా రియల్ టైమ్ లో ప్రజలకు మరిన్ని సేవలు. ఏ బీ సీ కేటగిరీలుగా సచివాలయాల సిబ్బంది విభజన ఉంటుంది. సిబ్బందిని సర్దుబాటు చేశాకే సచివాలయాల సిబ్బంది బదిలీలు చేపడతాం. సచివాయాల పనితీరు నిరంతరం పర్యవేక్షణకు మూడు అంచెల విధానం తెస్తాం” అని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఆందోళన అవసరం లేదు. పని విభజనను శాస్త్రీయంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ చేపట్టాం. పని భారం తగ్గించేలా హేతుబద్ధీకరణ ఉంటుంది. కేటగిరి ‘ఏ’లో పంచాయితీ కార్యదర్శితో పాటుగా డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. మహిళా పోలీసులను మరో కేటగిరీలో చేర్చనున్నాం. ఒక్కో సచివాలయంలో 7 నుంచి 8 మంది ఉద్యోగులు ఉండేలా హేతుబద్ధీకరణ. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతానికి ఎలాంటి బదిలీలు ఉండవు.
Also Read: ఏపీలో ఫ్యాన్ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయా? వైసీపీ మున్సిపాలిటీలు ఖాళీ కాబోతున్నాయా?
జిల్లా, మండల స్థాయిలో అధికారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పర్యవేక్షిస్తారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతులకు ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల కోసం జిల్లాల్లో మూడంచెల వ్యవస్థ తెస్తాం” అని మంత్రి స్వామి వెల్లడించారు.