Dearness Allowance : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త… డీఏ విడుదల

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని (కరవు భత్యాన్ని) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Dearness Allowance

Dearness Allowance : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని (కరవు భత్యాన్ని) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరువు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ డీఏ బకాయిలను 2022 జనవరి నుంచి మూడు విడతలుగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్

డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నారు. జడ్పీ, మండల పరిషత్​లు, గ్రామ పంచాయితీలు, ఎయిడెడ్ సంస్థలు, వర్సిటీ సిబ్బందికీ డీఏ వర్తిస్తుందని ఆర్ధికశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. జడ్పీ, మండల పరిషత్​లు, గ్రామపంచాయితీలు, ఎయిడెడ్ సంస్థలు, వర్సిటీ సిబ్బందికీ డీఏ వర్తిస్తుందని ఆర్ధికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Sun Cooling Down: చల్లారిపోతున్న సూర్యుడు?.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఇండియన్ సైంటిస్టులు

కాగా, ఎన్నాళ్లగానో డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్న ఉద్యోగులకు కాస్త ఊరట కల్పించింది ప్రభుత్వం. డీఏ ఉత్తర్వులు ఇచ్చినందుకు ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. ఇతర డిమాండ్ల విషయంలోనూ సానుకూలంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.