Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్

క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్. కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు కలిగిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్

Credit Debit Cards

Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్. కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు కలిగిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొత్త రూల్స్ ప్రకారం.. జనవరి 1 నుంచి లావాదేవీలు నిర్వహించాలంటే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు 16 అంకెలు ఎంటర్ చేయాలి. లేదంటే టోకెనైజేషన్ పద్ధతిని వాడాలి. ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇకపై వెబ్‌సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో కస్టమర్ల క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు నిక్షిప్తం కావు. ఇప్పటికే స్టోర్ అయిన వివరాలన్నీ కూడా తొలగించాల్సి ఉంటుంది. కార్డు నెంబర్లకు బదులు టోకెన్ నెంబర్లు వస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు లేదంటే డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు మర్చంట్ వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదు. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే కొత్త ఏడాది నుంచి మీరు కార్డు ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే.. ఆ వివరాలు స్టోర్ కావు.

Sun Cooling Down: చల్లారిపోతున్న సూర్యుడు?.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఇండియన్ సైంటిస్టులు

ఇక.. టోకెనైజేషన్ విధానంలో కార్డు కలిగిన వారు వారి కార్డు వివరాలను తెలియజేయాల్సిన పని లేదు. ఒరిజినల్ కార్డు నెంబర్‌కు బదులు ప్రత్యామ్నాయ కోడ్ ఇస్తారు. దీన్ని టోకెన్ అని పిలుస్తారు. అప్పుడు లావాదేవీ సమయంలో ఈ కోడ్‌ను అందిస్తే సరిపోతుంది. ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ప్రతి కార్డును ప్రత్యేకమైన టోకెన్ జారీ చేస్తారు.

కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఆర్బీఐ 2020 మార్చిలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. డేటా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. వెబ్‌సైట్స్, యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది.

Mustard Oil : అవనూనెతో వంట…బరువు తగ్గటం సులువు

ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లను అలర్ట్ చేస్తున్నాయి. మర్చంట్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో బ్యాంక్ కార్డు వివరాలు స్టోర్ చేయడం కుదరదని తెలుపుతున్నాయి. జనవరి 1 నుంచి లావాదేవీ నిర్వహించిన ప్రతిసారి కార్డు వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. లేదంటే టోకనైజేషన్ సిస్టమ్‌ను అనుసరించాలని సందేశాలు పంపుతున్నాయి.