Mustard Oil : అవనూనెతో వంట…బరువు తగ్గటం సులువు

దగ్గు, జలుబు తగ్గించడానికి ఆవనూనె బాగాసహాయపడుతుంది. కొద్దిగా ఆవనూనెను వేడి చేసి, అరచేతులు, అరికాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శరీరంలో వేడి కలిగి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

Mustard Oil : అవనూనెతో వంట…బరువు తగ్గటం సులువు

Mustard Oil

Mustard Oil : ప్రతి ఇంట్లో పోపుల పెట్టలో తప్పనిసరిగా ఉండే ఆవాలు రుచికి చేదుగా ఉంటాయి. పోపు పెట్టడానికి వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వంట చేసేందుకు ఆవ నూనె ఉత్త‌మ‌మైంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆవ నూనెను వంట‌కు ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని, అనేక లాభాలు క‌లుగుతాయని అంటున్నారు. ఆవనూనె ఇది శరీరంలోని కొవ్వుని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆల్ఫాలినోలిక్‌ యాసిడ్‌ ఇందులో పుష్కలంగా ఉంటుంది. అందుకే దీన్ని వంటలో వాడే సంప్రదాయం నేటికి కొనసాగుతుంది.

ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లలో వంటలలో ఆవనూనెను ఎక్కువగా వాడతారు. 100గ్రా ఆవనూనెలో కెలోరీలు 884, మొత్తం కొవ్వు153 గ్రా, దీన్లో శాచురేటెడ్‌ ఫ్యాట్‌ 12గ్రా, పాలీ శాచురేటెడ్‌ ఫ్యాట్‌21గ్రా, మోనో శాచురేటెడ్‌ ఫ్యాట్‌59గ్రా ఉంటుంది. ప్ర‌తి నూనెకు గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త ఉంటుంది. ఆవ‌నూనెకు 249 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే.. అంత వ‌ర‌కు నూనెను వేడి చేసినా ఏమీ కాద‌న్న‌మాట‌. ఆపైన ఇంకా వేడి చేస్తే అందులో హానిక‌ర వ్య‌ర్థాలు త‌యార‌వుతాయి. ఆవ‌నూనె గ‌రిష్ట వేడి చేసే ఉష్ణోగ్ర‌త స‌హ‌జంగానే ఎక్కువ క‌నుక‌.. దాన్ని మ‌నం ఎంత వేడి చేసినా ఏమీ కాద‌న్న‌మాట‌. అందులో హానిక‌ర వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి కావు. అందువ‌ల్ల అది ఆరోగ్య‌క‌ర‌మైన‌దని చెప్పవచ్చు.

మస్టర్డ్‌ ఆయిల్‌ యాంటీ బ్యాక్టీరియల్ హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణక్రియను రక్షించడంలో సహాయపడుతుంది. ఆవ‌నూనెలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఆవనూనెను ఉదరం, చాతీకి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శ్వాసనాళంకు గాలిబాగా ఆడుతుంది, నాజల్ ఫ్రీ అవుతుంది. రెగ్యులర్ గా ఆవనూనె తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

ఇది యాంటీమైక్రోబయాల్‌ అయిన అల్లైల్‌ ఐసోథియోసైనేట్స్‌ అనే అణువును కూడా కలిగి ఉంటుంది. కాబట్టి, ఇది రోగనిరోధక శక్తిని పెంచండంలో కూడా సహాయపడుతుంది.ఆవ నూనెలో ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి క‌నుక బ‌రువు త‌గ్గేందుకు, శ‌క్తికి ఇది ఉత్త‌మంగా ప‌నిచేస్తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఆవనూనె మెటబాలిజన్ని వేగవంతం చేసి, ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయడుతుంది. దాంతో బరువు తగ్గడం చాల సులువు. శరీరంలో ఫ్యాట్ కణాలు నిల్వ చేరకుండా చేస్తుంది.

శ్లేష్మం ఏర్పడకుండా నిరోధిస్తుంది ఆవలనూనె. వెల్లుల్లి, లవంగాలను ఆవనూనెతో కలిపి వంటలోనే కాకుండా ఛాతీపై రుద్దితే వెచ్చగా ఉంటుంది. దగ్గుకు మంచి ఉపశమనం ఇస్తుంది. అరచేతులు, అరికాళ్లపై రుద్దుకోవాలి.ఆవ‌నూనెలో క్యాన్స‌ర్‌తో పోరాడే గుణాలు ఉంటాయి. ఈ నూనెలో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లుగా మారుతుంది. దీంతో క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌వు. ఆవ‌నూనెలో ఆలైల్ ఐసోథ‌యోస‌య‌నేట్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. గాయాల‌ను త్వ‌ర‌గా మానుస్తుంది. ఆవనూనె అందానికి కూడా ప్రయోజనాలను ఇస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా మంచిది. చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది.

దగ్గు, జలుబు తగ్గించడానికి ఆవనూనె బాగాసహాయపడుతుంది. కొద్దిగా ఆవనూనెను వేడి చేసి, అరచేతులు, అరికాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శరీరంలో వేడి కలిగి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్‌ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే ట్రైగ్లిసరైడ్స్‌, రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం దరి చేరదు.

ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడొచ్చు. కూరలు, పకోడీలాంటి వేపుళ్లు, పచ్చళ్ల తయారీకి ఉపయోగించొచ్చు.ఈ నూనె వాడకం వల్ల హైపర్‌ థైరాయిడ్‌ రాకుండా ఉంటుంది. ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలను తొలిగించడానికి మస్టర్డ్ ఆయిల్‌ను రాసుకుంటే మంచిది.