ఆంధ్రప్రదేశ్‌లోని షాపింగ్ మాల్స్, మల్లీప్లెక్స్‌లలో పార్కింగ్ చార్జీల వసూళ్లపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదటి అరగంట సేపు ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పించాలని చెప్పారు. మాల్స్‌లో షాపింగ్ చేసినట్లు బిల్లు చూపిస్తే మెదటి గంటపాటు పార్కింగ్ ఉచితమని తెలిపారు.
పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ధర ఉన్న సినిమా టిక్కెట్ లేదా షాపింగ్ చేసిన బిల్లు చూపిస్తే పార్కింగ్ పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని అన్నారు. ఆయా మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, మల్లీప్లెక్స్ యజమానులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సురేశ్ కుమార్ జీవోలో పేర్కొన్నారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.