Vatsalya Scheme: ఏపీలోని అభాగ్యులైన పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం అండగా నిలుస్తోంది. తల్లిదండ్రుల్లో ఎవరు మృతి చెందినా, లేదంటే ఇద్దరూ లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నా.. అటువంటి పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తోంది. 1-18 ఏళ్ల వయసు ఉండి నిస్సహాయతకు గురైన వారికి ప్రతినెల రూ.4,000 ఇస్తోంది ప్రభుత్వం.
ఇందులో కేంద్రం వాటా రూ.2,400, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,600. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకం అమలు అవుతోంది. ఈ స్కీమ్ కింద ఇప్పటికే 2 విడతల్లో సాయం అందించారు. ఇప్పుడు మూడో విడత కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.
Also Read: చేతులు, కాళ్లు కట్టేసి.. కుక్కర్‌తో తలపై కొట్టి.. కత్తితో 20 సార్లు పొడిచి.. కూకట్‌పల్లి కేసులో జరిగింది ఇదే..
ఇలా అప్లై చేసుకోండి
- స్థానిక ICDS అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాలి
- అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులు, CDPOల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
- ధ్రువపత్రాలు కూడా అందజేయాలి
- ధ్రువపత్రాలుగా బర్త్ సర్టిఫికేట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, సంరక్షకుల లేదా తల్లిదండ్రుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీ అందజేయాలి. గెజిటెడ్ అధికారుల సంతకం వాటిపై చేయించి తీసుకురావాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేల లోపు ఉండాలి
- పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 96 వేల లోపు ఉండే వారు అర్హులు