×
Ad

AP Govt : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ విద్యుత్ ఛార్జీలు వెనక్కి.. మొత్తం రూ.923 కోట్లు..

AP Govt Electricity : ఏపీ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ నెల వరకు ..

AP Govt Electricity

AP Govt Electricity : ఏపీ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు ట్రూఅప్ అనే పేరును మాత్రమే విన్న వినియోగదారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తొలిసారి ట్రూడౌన్ (ఛార్జీల తగ్గింపు) అనే మాటను వినబోతున్నారు.

ట్రూడౌన్ ఛార్జీల రూపంలో మిగిలిన రూ.923.55 కోట్లను ఈ సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే ఏడాది.. అంటే.. 2026 అక్టోబర్ వచ్చే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయనున్నారు. దీనివల్ల యూనిట్‌కు 13పైసలు చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.

Also Read: VV Lakshmi Narayana: మంచి పాలన అందిస్తే.. జగన్ 11 సీట్లకే ఎందుకు పరిమితమైపోయారు? ప్రజలు ఎందుకు తిరస్కరించారు?

2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను డిస్కంలు దాఖలు చేసిన రూ.2,758.76 కోట్ల ట్రూఅప్ మొత్తానికి సంబంధించి ఏపీఈఆర్సీ రూ.1,863.64 కోట్లకు ఆమోదం తెలిపింది. కానీ, డిస్కంలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల నుంచి రూ.2,787 కోట్లు వసూలు చేశాయి. దీంతో ఆ మొత్తం నుంచి రూ.1,863.64 కోట్లను మినహాయించి మిగిలిన రూ.923.55 కోట్లను విద్యుత్ వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. దీంతో వినియోగదారులకు ఊరట లభించనుంది.

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. నవంబర్ నెల నుంచి యూనిట్ కు 13పైసలు తగ్గిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఛార్జీల భారం ఇంకా తగ్గుతుందని చెప్పారు. గత ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిందని, ఆ భారాలను ప్రజలపై మోపిందని అన్నారు. ఫలితంగా ఐదేళ్లలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.18వేలకోట్ల ట్రూఅప్ భారాలు వేసిందని మంత్రి విమర్శించారు. 2019లో మిగులు విద్యుత్‌తో ఉన్న రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని అన్నారు.

విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో 17.8శాతంగా ఉన్న స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లను 6.8శాతంకు తగ్గించిందని చెప్పారు. పీక్ డిమాండ్ సమయంలో అవసరమైన విద్యుత్ ను శ్వాపింగ్ విధానంలో పంజాబ్, హరియాణా నుంచి ఇచ్చిపుచ్చుకునే విధానంలో తీసుకుంటున్నామని, జెన్ కో థర్మల్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 90శాతంకు పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి రవికుమార్ తెలిపారు.